ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా జిల్లాల పెంపు అనే అంశం ఎక్కువగా వినిపించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండగా.. విడిపోయిన తర్వాత 13 జిల్లాలు ఏపీకి రాగా, తెలంగాణకు 10 జిల్లాలు వచ్చాయి. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారుగా 30 జిల్లాల వరకు పెంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు మొదటిసారి గెలిచినప్పుడు జిల్లాల పెంపు విషయాన్ని పట్టించుకోలేదు.



ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 26 జిల్లాలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కింద చేస్తూనే, ఒక అరక్ ప్రాంతాన్ని మాత్రం ఇంకొక జిల్లాని యాడ్ చేస్తే మొత్తం మీద 26 జిల్లాలు చేశారు.. అంటే 13 ని 26 జిల్లాలు చేశారు. అయితే దీని మీద ఒక కమిటీ వేసినటువంటి టిడిపి పార్టీ.. దీని మీద కార్యకర్తలు అడిగిన ప్రకారం కొన్ని కొన్ని మార్పులు చేయడానికి ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా టోటల్గా 36 జిల్లాలు వస్తాయి అన్నటువంటి లెక్క చెబుతున్నారు.


అందుకు సంబంధించి ఒక లెటర్ కూడా వైరల్ గా మారుతోంది.అయితే ఇది అధికారికంగా ప్రకటించలేదు. టిడిపి సర్కిల్స్ లోనే ఇది ఎక్కువగా సర్కులేట్ అవుతోంది. మొత్తం మీద 32 జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల లిస్ట్..పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, అమరావతి, బాపట్ల, మార్కాపురం, నరసరావుపేట, నెల్లూరు ,ఒంగోలు, గూడూరు, చిత్తూరు, తిరుపతి, హిందూపురం, అనంతపురం, మదనపల్లి, కర్నూలు ,ఆదోని ,నంద్యాల, రాజంపేట, కడప వంటివి జిల్లాలుగా అవుతాయని ఒక సర్కిల్ వైరల్ గా మారుతున్నది. మరి ఇందుకు సంబంధించి అధికారికంగా ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: