
ప్రస్తుతం చాలా వరకు దేశంలో అనేక ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత పథకాలు ప్రకటిస్తూ సోమరులను చేస్తున్నారనే మాట ప్రజల నుండి రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా ఉచితం అనేది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వొద్దు అనే నియమ నిబంధనలు పెట్టి మరీ ఇవ్వాలి. కానీ అనేక ఉచిత పథకాలు తీసుకువచ్చి అన్ని ఉచితంగానే ఇస్తే చివరికి రాష్ట్రం, దేశం దివాలా తీసి మంగోలియా, వెనిజులా లాంటి దేశాల పరిస్థితులు ఏర్పడతాయి. కానీ రాజకీయ నాయకులు వారి రాజకీయ అవసరాల కోసం ఉచితాలు ప్రకటిస్తూ ప్రజలను సోమరులను చేస్తున్నారు.. ఇలా ఒక్క పార్టీ అని కాదు దేశంలో అన్ని పార్టీలు ఇలాగే తయారయ్యాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించారు.