ప్రస్తుతం దేశాన్ని మోడీ శకం వైపు నడిపిస్తూ, భారత ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటిస్తున్న నాయకుడిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తున్నారు. అయితే ఈ గమ్యం వైపు దేశాన్ని నడిపించే పక్కచక్కని సారధి ఎవరు అంటే, అమిత్ షా అని దేశం మొత్తానికి తెలిసిన సంగతే. మోడీ చిత్తశుద్ధి, అమిత్ షా చాణక్య బుద్ధి – ఈ కలయికే భారత్ విజయ యాత్ర వెనుక రహస్యమని అనేది బీజేపీ వర్గాల్లో ఓ అంగీకారమైన వాస్తవం. బాల్యం నుంచే దేశ సేవ లక్ష్యం! గుజరాత్ కు చెందిన అమిత్ షా బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ద్వారా దేశ సేవ లక్ష్యంగా జీవితం గడిపారు. 1987లో బీజేపీలోకి వచ్చిన షా, బీజేవైఎం నుంచి తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. అప్పటి నుంచే మోడీ స్నేహితుడిగా, సహచరుడిగా, కీలక సహాయకుడిగా ఎదిగారు.


గుజరాత్ నుంచి దేశ రాజధానికి..! 1997లో ఎమ్మెల్యేగా గెలిచి గుజరాత్ అసెంబ్లీకి అడుగుపెట్టిన షా, 2001లో మోడీ సీఎం అయ్యాక మంత్రివర్గంలో చేరారు. అప్పటి నుంచే దేశవ్యాప్తంగా తన సత్తా చూపిస్తూ, బీజేపీని గ్రామగ్రామానికి తీసుకెళ్లిన వ్యూహకర్తగా మారిపోయారు. చాణక్య పాత్రతో చరిత్ర సృష్టించిన నేత! 2014లో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, 2015లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన షా, 2019లో మోడీ 2.0 గెలుపుకు బలమైన వ్యూహాలు రూపొందించి విజయాన్ని అందించారు. అందుకే బీజేపీ శ్రేణులు ఆయనను ప్రేమగా “చాణక్యుడు” అంటారు. ఆరేళ్ల 64 రోజులు – హోంమంత్రి రికార్డు..! 2019 జూన్ లో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన షా, 2025 ఆగస్టు 5తో 6 ఏళ్లు 64 రోజులు పూర్తి చేశారు. ఇది ఎల్ కే అద్వానీ రికార్డును బద్దలు కొట్టిన ఘనత.


ఇంకా పదవిలో కొనసాగుతున్నందున, గోవింద్ వల్లభ్ పంత్ రికార్డు (longest-serving home minister) కూడా అధిగమించే దిశగా ఉన్నారు. ఆర్టికల్ 370 నుంచి ఆపరేషన్ కాగర్ వరకు... జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు (ఆర్టికల్ 370), మావోయిస్టులపై ఆపరేషన్ కాగర్, దేశంలోని అంతర్గత భద్రతను బలపరిచే ఎన్నో సంస్కరణలు – ఇవన్నీ అమిత్ షా చరిత్రలో అక్షరాలా నిలిచిపోతాయి.మొత్తానికి.. దేశ రాజకీయాల్లో మోడీ–షా జోడీ గెలుపు చిహ్నంగా మారింది. ఒకరి శక్తి, మరొకరి వ్యూహం – రెండు కలిస్తే సాధ్యమవని అనుకున్న ఎన్నో అసాధ్యాల్ని సాధ్యం చేశారు. ఇప్పుడు అమిత్ షా – దేశ రాజకీయ చరిత్రలో వంశపారంపర్య రాజకీయం లేకుండా పైకి వచ్చిన అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలవబోతున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: