ఏమైందో తెలియదు కానీ గత కొద్దిరోజుల నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సైలెంట్ గానే ఉన్నారు. ముఖ్యంగా పులివెందులలో, ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ బరిలో తన పార్టీ అభ్యర్థులు మొయిల్లా శివకళ్యాణ్ రెడ్డి, పూల విజయభాస్కర్ నిలిచారు. అయితే వారిని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చెయ్యకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి ఈ రెండు చోట్ల ప్రచారం చేయవలసి ఉండగా కానీ ఎన్నికలతో రాజకీయాలతో సంబంధం లేదన్నట్టుగా షర్మిల వ్యవహరిస్తూ ఉన్నది.


ఇక ఇటీవలే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు అయిన రాహుల్ గాంధీ కూడా ఎన్నికలలో అవకతవకల విషయంపై అన్ని విషయాలను బయటపెట్టారు. రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా లైవ్లో కూడా ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోలేదనే విమర్శలు కూడా వినిపించాయి.  ఆంధ్రప్రదేశ్లో మాత్రం షర్మిల కి సంబంధించి ఏదో వ్యతిరేకంగానే జరుగుతోందని ప్రచారం సాగుతోంది. అందుకే షర్మిల సైలెంట్ గా ఉన్నారని వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా సరస్వతి పవర్ ప్లాంట్ షేర్స్ బదిలీ విషయంపై షర్మిలకి వ్యతిరేక నిర్ణయం వచ్చినప్పటి నుంచి ఆమె చాలా నీరుత్సాహంలో ఉన్నట్లుగా కొంతమంది కాంగ్రెస్ నేతలు తెలియజేస్తున్నారు. ఇటీవలే వైయస్సార్ విగ్రహాన్ని కూల్చడంతో సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తూ పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. అయితే ఇప్పుడు పులివెందుల ,ఒంటిమిట్టలో జడ్పిటిసి ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తమ పార్టీ అభ్యర్థులను మాత్రం గెలిపించాలని అడగకపోవడంతో షర్మిల వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంపై షర్మిల ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉన్నది. ఇప్పటికే ఈ రెండు చోట్ల అటు టిడిపి, వైసిపి నేతల మధ్య కొంతమేరకు ఉద్రిక్తతమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రేపటి రోజున ఈ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: