
జాతీయ పార్టీకి ఉండాల్సిన అర్హతలు ఇవే:
జాతీయ పార్టీగా అర్హత సాధించాలి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏవైనా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో గుర్తింపు పొంది ఉండాలి. ఇది మెయిన్ పాయింట్. లేదంటే ఏవైనా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో అసెంబ్లీకి గాని లేక ఎంపీ ఎన్నికల్లో గాని చెల్లుబాటైన మొత్తం ఓట్లల్లో ఆ పార్టీకి ఎలా లేదన్న కనీసం ఆరు శాతం ఓట్లు రావాలి. అంతేకాదు ఇక లోక్ సభలో కనీసం నలుగురు ఎంపీలు ఉండాలి. అదే విధంగా కనీసం మూడు రాష్ట్రాలలో రెండు శాతం ఎంపీ సీట్లు అయినా వచ్చి ఉండాలి.
సిపిఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా) కు జాతీయ గుర్తింపు లేదు:
నిజానికి..ఒకపూడు ఈ పార్టీకి జాతీయ గుర్తింపు ఉండింది. కానీ అది ఇప్పుడు లేదు. ఏలెక్టర్ కమిషన్ ఆఫ్ ఇండియా 2023 ఏప్రిల్ 10న, సిపిఐకు జాతీయ పార్టీ స్థాయి గుర్తింపును రద్దు చేసింది . ఈ నిర్ణయం, అదేరోజు AAP జాతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వడంతో జారీ చేయబడింది.
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన జాతీయ పార్టీలు:
భారతదేశంలో ప్రస్తుత జాతీయ పార్టీలు (2025 ప్రకారం):
భారతీయ జనతా పార్టీ (BJP)
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC / కాంగ్రెస్)
బహుజన సమాజ్ పార్టీ (BSP)
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (Marxist) [CPI (M)]
నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)
ఈ పార్టీలే ప్రస్తుతం జాతీయ స్థాయిలో నియమిత గుర్తింపు పొందిన పార్టీలు ..!!