కడప జిల్లాలోని పులివెందులలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రెండు స్థానాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ లో హోరాహోరి పోటీ ఏర్పడింది. ఇప్పటికే నేతలు అంతా ప్రజలను ప్రలోభాలు పెడుతూ అన్ని రకాలుగా సమర్పించుకున్నారు. అయితే ఈ రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీతో పాటుగా మరో 11 మందితో కలిపి 22 మంది పోటీపడ్డారు. సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ పోలింగ్ లో ఇప్పటికే ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ప్లేస్ కు చేరుకున్న వేలాది మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పులివెందుల జడ్పిటిసి స్థానం పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది,

 అలాగే ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో 24 వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రెండు మండలాల్లో పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు... ఇదిలా కొనసాగుతున్న తరుణంలో  ఓటర్ స్లిప్పుల గందరగోళం కొనసాగుతోంది. ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో పోలింగ్ కు కొన్ని గంటల ముందే ఒక ట్విస్ట్ చోటుచేసుకుంది. ధవంతంపల్లి లోని ఒక ఎస్సీ కాలనీలో వారి యొక్క ఓటర్ స్లిప్పులను టిడిపి నేతలు తీసుకుపోతున్నారని ప్రజలు ఆగ్రహించారు.

పోలింగ్ బూత్ నెంబర్ తేడా పడిందని బుకాయిస్తూ, గ్రామమంతా వదిలేసి కేవలం ఎస్సీ కాలనీలోకి వచ్చి మాత్రమే స్లిప్పులు తీసుకుంటున్నారని ప్రజలు తిరగబడ్డారు. మా స్లిప్పులు మాకు ఇవ్వండి మేము ఓట్లు వేస్తామంటూ డిమాండ్ చేశారు. టిడిపి లీడర్లను ఎస్సీ కాలనీ జనాలంతా  ప్రశ్నించడంతో కొత్త స్లిప్పులు వస్తాయని బుకాయించి  దాదాపు 300 స్లిప్పులను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్రిక్త పరిస్థితులలో ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయనేది ఉత్కంఠ నెలకొంది.. అలాగే ఈ జెడ్పిటిసి స్థానాల్లో టిడిపి పార్టీ గెలుస్తుందా వైసిపి పార్టీ గెలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: