పులివెందుల పులి … టైగర్ … అంటూ జగన్‌ను ఆకాశానికి ఎత్తి పొగడడంలో వైసీపీ వర్గాలు ఎప్పుడూ ముందే ఉంటాయి. జగన్ పేరు వినగానే పులివెందుల ఓటర్లు కేకలు వేసిన రోజులు ఉన్నాయి. కానీ తాజాగా అక్కడే జరిగిన జడ్పీటీసీ ఉపఎన్నిక ఫలితాలు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చేశాయి. ఓటమి మాత్రమే కాదు … డిపాజిట్ పోయే స్థితి! ఇది వైసీపీ పుట్టినప్పటి నుంచి చూడని దుర్ఘటన. ఎన్నికల తీర్పు పవిత్రం .. ఎన్నికల సమయంలో ఎంత అధికార బలం, ఎంత రిగ్గింగ్ టాక్, ఎంత దౌర్జన్యం ఉన్నా … చివరికి పోలింగ్ బాక్స్‌లో పడిన ఓటే అసలు తీర్పు. దాన్నే గెలుపు ఓటమి నిర్ణయిస్తుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలు అన్నీ ఒక్క లక్ష్యమే – ఓటు సొంతం చేసుకోవడం. కానీ పులివెందులలో ఈసారి జగన్ గార్డు కూలిపోయింది.


ఓటమి బరువు తెలిసిందా? .. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైసీపీకి ఇంకా గాయం మానకముందే ఈ ఉపఎన్నిక గుద్దు పడింది. పులివెందుల అంటే జగన్ సొంత ఇలాకా. అక్కడే డిపాజిట్ పోతే, మిగతా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి ఏంటి అన్న ఆందోళన మొదలైంది. గతంలో కాంగ్రెస్ డిపాజిట్ పోతే గేలి చేసిన వైసీపీకి ఇప్పుడు తానే అదే పరిస్థితిలో చిక్కుకోవడం ఐరనీగా మారింది. లైట్ తీసే పరిస్థితి లేదు .. "ఒక్క చిన్న ఎన్నికే కదా" అని లైట్ తీసుకోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే పులివెందుల అంటే జగన్ అడ్డా అని గర్వంగా చెప్పుకునే స్థలం. ఒక్క మాట చెబితే జనాలు తలవంచి ఓటేస్తారని నమ్మకం. కానీ ఈసారి రిజల్ట్ రివర్స్. పులివెందుల గుండెలోనే బీటలు పడితే, మిగతా ఏరియాల్లో ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు.



కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతింది .. వైసీపీ వర్గాల్లో మోరల్ డౌన్. "ఇది ఎలా జరిగిందీ?" అని వాళ్లలో వారే మర్మరాలు. 2024లోనే పార్టీకి రియాలిటీ చెక్ వచ్చిందని అనుకుంటే, ఇప్పుడు ఈ ఉపఎన్నిక ఫలితం ఇంకో బెల్ మోగించింది. "మా మాటే శాసనం" అన్న పులివెందుల వైసీపీకి ఈ ఓటమి కఠిన హెచ్చరిక. ఇక జగన్, వైసీపీ ఏమి చేసి ఈ నైతిక బలం తిరిగి తెచ్చుకుంటారో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది – పులివెందుల పులి ట్యాగ్ మళ్లీ రాబట్టుకోవడం ఈసీ కాదని!

మరింత సమాచారం తెలుసుకోండి: