
ఏఐఏ డీఎంకే మన తమిళనాడు వ్యక్తికీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం లభించిందని కాబట్టి మీరు పోటీ పెట్టవద్దని డీఎంకేను కోరింది. ఇతర పార్టీలతో సైతం చర్చించి మన తమిళనాడు వ్యక్తికీ ఏకగ్రీవంగా పదవి దక్కేలా కృషి చేయాలనీ కోరింది. అయితే ఊహించని ఈ ప్రకటనతో ప్రస్తుతం డీఎంకే ఇరకాటంలో పడిందని కామెంట్లు వ్యక్తవుతున్నాయి.
ఈ విషయంలో స్టాలిన్ ప్రస్తుతం రాహుల్ గాంధీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారట. నేను కచ్చితంగా ఇప్పుడు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే నెలకొందని స్టాలిన్ చెబుతున్నట్టు సమాచారం అందుతోంది. గతంలో పలు రాష్ట్రాల నేతలు ఇదే విధంగా మద్దతు ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయని ఈ సందర్భంగా స్టాలిన్ సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
ఒకవేళ తన వైపు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఉండాలంటే తమిళనాడుకు చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని కోరినట్టు తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి నామినేషన్లకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి బీజేపీ తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు