
అయితే ఇప్పుడు తాజాగా కొన్ని నియోజకవర్గాలలో సీన్ రివర్స్ అయ్యి జనసేన పార్టీ పెత్తనం కొనసాగిస్తోందనే విధంగా వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఓటు బ్యాంకు కలిగి ఉన్న గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ తమ హవా కొనసాగించాలని ప్రయత్నం చేస్తుందని కొంతమంది టిడిపి నాయకులు కూడా తెలియజేస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవడానికి పిల్లి సత్తిబాబు కుటుంబ సభ్యులు చాలా కృషి చేశారు.
అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నానాజీ ఇప్పటివరకు తనకు గాని తన పార్టీ కార్యకర్తలకు కానీ ఏ విధమైనటువంటి సహకారం కూడా అందించలేదనే విధంగా తెలుపుతున్నారు పిల్లి సత్తిబాబు. ముఖ్యంగా టిడిపి కార్యకర్తలు ఎవరైనా వెళితే ఊరి పేరు చెప్పి మరి ఆ ఊరు యొక్క జనసేన ప్రెసిడెంట్ ను తీసుకురావాలని చెబుతున్నారట. దీనివల్ల అటు పార్టీ కార్యకర్తలు చాలా మనస్థాపన చెందుతున్నారని టిడిపి నేతలు ఆవేదన చెందుతున్నారు. కాకినాడ రూరల్ టిడిపి కోఆర్డినేటర్ గా ఉండి ఫలితం లేదని పిల్లి సత్తిబాబు తాజాగా రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం చర్చినయంశంగా మారింది. టిడిపి కోఆర్డినేటర్ , ఆర్డినేటర్ వర్గాలు మండల అధ్యక్షుడు నియామక విషయంలో వీరి మధ్య ఘర్షణ జరగడంతో టిడిపి పదవికి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలను తెలియజేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా లేఖ రాశారు సత్తిబాబు. తనకు పదవి అవసరం లేదని కేవలం పార్టీలో కార్యకర్తగా ఉంటానంటూ తెలిపారు పిల్లి సత్తిబాబు.