
కానీ నానో యూరియాని మాత్రం రైతులు వద్దంటున్నారు.. అసలు రైతులు ఎందుకు నానో యూరియాని వద్దంటున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. ఇండియాలో నానో యూనియన్ IFFCO 2021 లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం దినిని పర్యావరణహితమైనదిగా పంట దిగుబడి పెంచుతుందని తెలియజేస్తున్నారు. కానీ రైతులు, శాస్త్రవేత్తలు మాత్రం ఈ నానో యూరియాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే రైతుల అనుభవం ప్రకారం నానో యూరియా పూర్తిగా యూరియాకు రీప్లేస్మెంట్ కాదని అలాగే పంట దిగుబడి కూడా తగ్గిస్తుందని తెలుపుతున్నారు. ఇది పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 2024లో ఒక అధ్యయనంలో తేలిందట.
నానో యూరియా అని పిచికారి చేయడం వల్ల వరిలో 12% గోధుమలో 21.6 శాతం వరకు దిగుబడి తగ్గినట్లుగా తెలుపుతున్నారు.అలాగే లిక్విడ్ కావడం చేత నానో యూరియా పిచికారి చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఎక్కువ లేబర్లు ఉండాల్సి ఉంటుంది. యూరియా వల్ల పంట దిగుబడి పెరిగితే నానో యూరియా వల్ల పంట దిగుబడి తగ్గుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతులు వ్యతిరేకించడానికి ముఖ్య కారణం.. 50 కేజీల బస్తా ఉన్న యూరియా కేవలం 500 ML నానో యూరియా సమానంగా ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.
కానీ పరిశోధకులు మాత్రం నానో యూరియాను డైరెక్టుగా మొక్కలపైన స్ప్రే చేస్తాము కాబట్టి అది మొక్కల మీద పనిచేస్తుంది.. 45 కేజీల యూరియాను మట్టిలో పిచికారి చేయడం వల్ల పర్యావరణ కలుషితం అవుతుందంటూ.
నానో యూరియాను స్ప్రే చేయడం వల్ల 90 శాతం వరకు అందులో ఉండే పార్టికల్స్ మొక్కలు గ్రహిస్తాయని తెలుపుతున్నారు. యూరియా అయితే కేవలం 30 శాతం వరకు మాత్రమే గ్రహిస్తాయని తెలుపుతున్నారు.
యూరియా ఎక్కువ వాడడం వల్ల నేల దెబ్బతింటుందని నానో యూరియా అయితే మట్టి, నీరు, గాలి, కాలుష్యం కాకుండా చేస్తాయని తెలుపుతున్నారు.
నానో యూరియా వాడితే ప్రభుత్వాలకు యూరియా నుంచి దిగుమతుల ఖర్చు తగ్గిపోతుంది ఇలా ఒక ఏడాదికి సుమారుగా 40 వేల కోట్ల రూపాయలు హాజరవుతుందని అంచనా వేస్తున్నారట.
45 కేజీల యూరియా ప్యాకెట్.. 270(లేదా 300)రూపాయలు కాక అర లీటర్ నానో యూరియా బాటిల్ రూ .240.