
జగన్ హయాంలో నిర్మించతలపెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. వైద్య విద్యను ప్రైవేటు పరం చేస్తే ఫీజులు గణనీయంగా పెరుగుతుయాన్నారు. ప్రైవేటు సంస్థలు లాభాపేక్షతో పనిచేస్తాయన్నారు. దీని వల్ల నిరుపేద విద్యార్ధులకు అవకాశాలు తగ్గుతాయని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి చాలా మండి నిరుపేద విద్యార్ధులు నీట్ లో సీట్లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకప్పుడు 2,360 సీట్లు ఉంటే ఈ కొత్త కాలేజీల వల్ల ఆ సంఖ్య 4910 కి పెరుగుతుందని దానివల్ల మరో 2500 విద్యార్ధులకు మేలు జరుగుతుందున్నారు. అయితే మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడం వల్ల చాలా మంది విద్యార్ధులకు నష్టం జరుగుతుందన్నారు. రెండు ప్రభుత్వాలు కూడా వైద్యవిద్య, ప్రజారోగ్యంతో రాజకీయాలు చేశాయని ఆయన విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ఆయన హెచ్చరించారు.