భారతదేశంలో పుష్కరాలకు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో ఉండే పవిత్రమైన నదులకు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ పుష్కరాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కృష్ణ, గోదావరి నదుల పుష్కరాలు చాలా ఘనంగానే జరుగుతాయి. ఈసారి గోదావరి పుష్కరాల పైన ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగాలి అనే విషయం పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.



గతంలో గోదావరి పుష్కరాలు 2015 జూలై 14 నుంచీ 25వ తేదీ వరకు చాలా గ్రాండ్గా జరిగాయి. అయితే ఈసారి గోదావరి పుష్కరాలను 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు నిర్వహించాలంటూ పండితులు సైతం తెలియజేస్తున్నారు. టీటీడీ ఆస్థాన సిద్ధాంతితో పాటుగా మొత్తం మీద 16 మంది ఆగమ, వైదిక పండితులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పుష్కరాల తేదీ పైన వారందరూ ఒక ఏకాభిప్రాయాన్ని తెలియజేశారు. 2027 జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించే విధంగా సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి కూడా నివేదిక తయారు చేసి పంపించినట్లు సమాచారం.


అలాగే మరొకవైపు రాజ మహేంద్రవరంలోని కలెక్టర్ చేకూరి కీర్తీ ఆధ్వర్యంలో ఈ పుష్కరాలు జరగబోతున్నాయి. కలెక్టర్ తో పాటు , పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మరి కొంతమంది నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా 2027లో జరిగేటువంటి ఈ పుష్కరాలకు 8 కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు. అలాగే గోదావరి, నిడదవోలు, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో అన్ని సదుపాయాలు కల్పించాలని అందుకోసం ఇప్పటినుంచి ఏర్పాట్లు చేయాలని సమావేశంలో సూచించారు. ఇందుకు సంబంధించి అన్ని విషయాలను కూడా అటు సీఎం చంద్రబాబుతో చర్చించబోతున్నట్లు ఈ సమావేశంలో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: