చంద్రబాబుకు రోజుకో షాక్ ఇస్తున్నారు పార్టీ నేతలు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరుతారో అర్థంకాని పరిస్థితి. 70 ఏళ్ళ చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీలోని కీలక నేతలు అంత బీజేపీ, వైసీపీ పార్టీలలో చేరుతున్నారు. అయితే తాజాగా ఈ బాటలోనే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ చేరనున్నారు. 

                 

ఈ నెల చివరి వారంలో తల్లి, కొడుకు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకొని కండువా కప్పుకోనున్నారు. పార్టీ మారే విషయంపై ఆదివారం భీమ్‌గల్‌ మండలం మెండోర శివారులో అనుచరులతో ఆమె సమావేశం నిర్వహించారు. పరిమిత సంఖ్యలో ముఖ్య అనుచరులను సమావేశానికి ఆహ్వానించగా, సుమారు మూడొందల మంది ఆ సమావేశానికి హాజరయ్యారు.

                 

దీంతో ఆ సమావేశంలో అనుచరులంతా కూడా బీజేపీలో చేరాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ అగ్ర నాయకత్వం పార్టీలోకి ఆహ్వానించిన విషయాన్ని అన్నపూర్ణమ్మ అనుచరులకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో చేరడమే ఉత్తమమని అనుచరులు కూడా సూచించారు. మహారాష్ట్రలో అసంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 22వ తేదీన కనుక ఈ నాలా ఆఖరిలో అన్నపూర్ణమ్మ, మల్లికార్జున్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరనున్నారు. 

                 

అయితే అన్నపూర్ణామ్మ, ఆమె కొడుకు మల్లికార్జున రెడ్డినే టీడీపీలోకి చేరాలనుకున్నారా ? లేక చంద్రబాబు నాయుడు బీజేపీలోకి వెళ్ళమని సూచించాడా అనే అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. మరి నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. 

                    

మరింత సమాచారం తెలుసుకోండి: