అందరూ క్షమాగుణాన్ని అలవరచుకుంటే మంచిది..క్షమా గుణానికి మంచి ఉదాహరణ మనం వృక్షాలను తీసుకోవచ్చు. ఎందుకంటే తన పైకి గురి చూసి రాయి విసిరినప్పటికీ, విసిరిన వాడికి అమృత ఫలాలను ఇచ్చే ఒక మంచి వృక్షము క్షమా గుణానికి నిలువెత్తు సాక్ష్యం.. మన్నించే మనసే ఉంటే, అది సామరస్యతకు సోపానం అవుతుంది. అనే ఈ నిజం ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే , సామరస్యంతో కూడిన సమాజం ప్రారంభమవుతుంది.