ద్రౌపది అనగానే.. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఐదు భర్తలను కలిగిన ఒక సాధారణ మహిళగా మాత్రమే తెలుసు. అయితే ఓర్పులో భూదేవిని, సహనంలో సీతాదేవిని మించిపోయిన ఆమె వ్యక్తిత్వం గురించి చాలా మందికి తెలియదు. పాండవుల తల్లి కుంతీ దేవి కూడా తెలిసి తెలిసి ద్రౌపదిని ఐదుగురు సమానంగా పంచుకోమని చెబుతుంది. అర్జునుడి మీద ఎన్నోకలలతో మెట్టినింట అడుగుపెట్టి న ద్రౌపది కష్టాల కడలిని జీవితంలో ఎదుర్కొంటుంది.ఆమె ధర్మరాజుని ఎప్పుడూ రాజు లాగే చూసింది. భీముడిని ఆప్తుడిగా చూసింది. ఇక నకుల, సహదేవులను బిడ్డలుగా చూసుకుంది. కేవలం అర్జునుడిని మాత్రమే ఆరాధించింది. నిజమైన భర్తగా అర్జునుడిని మాత్రమే చూసిందని వ్యాస భారతంలో స్పష్టంగా ప్రస్తావించబడింది.