
శకుని అనగానే ముందుగా గుర్తొచ్చేది పాచికలు, ఎత్తుగడలు, మాయ, మోసం.. ఇక వర్ణించడానికి మాటలు కూడా ఉండవు. అంతటి దుర్మార్గుడు శకుని అని అందరికీ తెలుసు. నిజానికి శకుని ఇంత దుర్మార్గుడిగా మారడానికి కారణం ఎవరో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా శకుని గురించి అపార్థం చేసుకోరు. ఇదంతా పక్కన పెడితే , శకుని తన కనుసైగలతో పాచికలను మారుస్తాడు అని మహాభారతం నాటి నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఇలా మోసం చేసే కౌరవుల చేతిలో పాండవులు ఓడిపోయేలా చేశాడు. ఇక ఈ పాచికల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఎందుకు ఈ పాచికలు శకుని మాట వింటాయి ? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..




శకుని జన్మించింది గాంధార రాజ్యంలో. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో కాంధార్ గా పిలువబడుతోంది. శకుని తండ్రి సుభల. ఇతనికి వందమంది కుమారులు. ఒక కుమార్తె. సుభలకి శకుని నూరవ సంతానం. శకుని తరువాత జన్మించిన అమ్మాయి గాంధారి. సుభల తన పిల్లలందరినీ ఉదయాన్నే నిద్ర లేపి , శివపూజ చేయించడంతో ప్రతి ఒక్కరు శివభక్తులు అయ్యారు. ఇక శకుని చిట్టచివరి వాడు కావడం చేత చురుకుగా, చలాకీగా ఉండడంతోపాటు పెద్దయిన తర్వాత శస్త్ర విద్యలో, జూదంలో మంచి నేర్పు కూడా పొందగలిగాడు.







