ప్రస్తుతం టీమిండియా జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ గత కొంతకాలం నుంచి అద్భుతమైన ఫాంలో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా తన స్పిన్ మాయాజాలంతో మ్యాజిక్ చేస్తున్నాడు. ప్రత్యర్థులను తికమక పెడుతూ కీలకమైన సమయంలో వికెట్లను పడగొడుతూ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్  క్రియేట్ చేస్తున్న రికార్డులు అద్భుతమనే చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి కేవలం టెస్ట్ క్రికెట్ కు మాత్రమే పరిమితం అయిన రవిచంద్రన్ అశ్విన్.. ఇక ఇటీవల కాలంలో పరిమిత ఓవర్లఫార్మాట్ లో కూడా ఆరంగేట్రం చేశాడు. టి20 ఫార్మాట్ లో ఫార్మాట్లో అరంగేట్రం చేసి సత్తా చాటిన రవిచంద్రన్ అశ్విన్ మరికొన్ని రోజులు సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.


 ఇక టెస్టు ఫార్మాట్ విషయానికి వస్తే రవిచంద్రన్ అశ్విన్ ప్రతి  టెస్టు సిరీస్లో కూడా ఎక్కువగా వికెట్లు పడగొడుతూ ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పాలి. ఇక జట్టుకు అవసరమైనప్పుడు అటు బ్యాటింగ్లో కూడా రాణిస్తూ అద్భుతంగా సత్తా చాటుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా  పర్యటనలో భాగంగా జోహన్నెస్బర్గ్ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరగగా టీమిండియా ఓటమి పాలయింది. అయితే అటు రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఒక అరుదైన ఫీట్ సాధించాడు. జోహన్నెస్బర్గ్ వేదికగా వండరార్స్  మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆటగాడు  పీటర్సన్ వికెట్ తీసుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. తద్వారా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత వండరార్స్ మైదానంలో వికెట్ తీసిన భారత స్పిన్నర్ గా అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.


 ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమ్ ఇండియా జట్టుపై దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. సౌతాఫ్రికా కెప్టెన్  ఎల్గర్  అద్భుతంగా రాణించడంతో చివరికి టీమిండియాకు ఓటమి తప్పలేదు. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1 తో సమానంగా ఉంది. జనవరి 11వ తేదీన మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ మ్యాచ్లో ఫలితం తేలపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: