గత కొంత కాలం నుంచి పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తూన్న విరాట్ కోహ్లీ స్థానం రోజురోజుకు డేంజర్ జోన్లో పడిపోతుంది అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఎంత గొప్ప ఆటగాడు అయినప్పటికీ జట్టుకు భారంగా మారినప్పుడు పక్కన పెట్టడం ఇప్పటివరకు ఎన్నో సార్లు చూశాము. ఇప్పుడు కోహ్లీ విషయంలో కూడా ఇదే జరగబోతుందని కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోహ్లీ కి ఎన్నోఅవకాశాలు ఇచ్చినా బీసీసీఐ.. ఇక ఇప్పుడు కోహ్లీకి ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో ఉంది అన్నది అర్ధమవుతుంది.


 ఈ క్రమంలోనే కోహ్లి స్థానాన్ని దక్కించుకునేందుకు ఒక యువ ఆటగాడు తన ప్రతిభతో సెలెక్టర్లు చూపును బాగా ఆకట్టుకుంటున్నాడు అనేది తెలుస్తుంది. ఆ యువ ఆటగాడు ఎవరో కాదు దీపక్ హుడా. ఐపీఎల్లో గతంలో పంజాబ్ తరఫున ఈ ఏడాది లక్నో తరఫున ఆడిన ఈ ఆటగాడు బ్యాటింగ్లో  దంచి కొట్టాడు. ఇక అనూహ్యంగా టీమిండియా లోకి కూడా వచ్చేశాడు. ఇండియా లోకి వచ్చిన తర్వాత కూడా బ్యాటింగ్లో తగ్గేదే లేదు అన్నట్లుగా అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు.  ఇటీవల సెంచరీతో కూడా ఆకట్టుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టాడు. 194.11 బైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు.


 అయితే మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి 194.11 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన తొలి ఆటగాడు దీపక్ హుడానే  కావడం గమనార్హం. ఇందులో మూడు ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి మొత్తం 17 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో  టి20లో సెంచరీలు సాధించిన దీపక్ హుడా ఇప్పుడు అదే ఊపు కంటిన్యూ చేస్తున్నాడు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఎంతో సెటిల్డ్ బ్యాట్స్మెన్ లాగా ఆరంభం నుంచే మంచి షాట్లు ఆడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే దీపక్ హుడా ప్రదర్శన భారత జట్టు సెలెక్టర్లను ఆకర్షిస్తోంది. ఒకవేళ టి20 వరల్డ్ కప్ లో కోహ్లీ రాణించక ఉండే కోహ్లీ స్థానం దీపక్ హుడకి  దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పలువురు క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: