ఇటీవల కాలంలో ద్వైపాక్షిక సిరీస్ లలో టీమ్ ఇండియా ఎంత అద్భుతంగా రాణిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలు అందుకున్న నాటి నుంచి కూడా ఇక ప్రత్యర్థులపై పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకుపోతుంది టీమిండియా. విదేశీ పర్యటనకు వెళ్లిన లేదా స్వదేశీ పర్యటనలకు వేరే జట్టు వచ్చినా కూడా అటు సిరీస్ మాత్రం టీం ఇండియాదే అన్న విధంగా ప్రస్తుతం ఆదిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే అలాంటి జట్టు అటు ప్రపంచ కప్ వచ్చేసరికి మాత్రం డీల పడిపోతోంది. ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక చివరికి ఇక అభిమానులు అందరినీ నిరాశ పరుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా ఇలాంటిదే జరిగింది.


 ప్రపంచ కప్ ముందు వరకు కూడా వరుసగా ద్వైపాక్షిక సిరీస్లలో విజయం సాధించిన టీమిండియా ఇక వరల్డ్ కప్ లో కూడా అద్భుతంగా రానించి టైటిల్ విజేతగా నిలుస్తుంది అని అందరు అనుకున్నారు. కానీ టీమిండియా మాత్రం  సెమీఫైనల్ నుంచి ఇంటిదారి పట్టి అభిమానులందరికీ కూడా నిరాశపరిచింది. వరల్డ్ కప్ లో ప్రదర్శన తర్వాత అటు టీమిండియా బ్యాటింగ్లో బౌలింగ్లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.


 ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో అనుహ్యమైన  మార్పులు చోటు చేసుకోబోతున్నాయని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో రెండు వరల్డ్ కప్పుల వీరుడుగా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోని సేవలను బీసీసీఐ వాడుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని భారత క్రికెట్ డైరెక్టర్గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ నెలాఖరులో జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: