కరోనా మరోసారి మనిషి శక్తి ఏంటో తెలియజెప్పింది. మన పరిమితులేంటో కళ్లకు కట్టింది. ఈ నేపథ్యంలో పలువురు సామాజిక మాధ్యమాల్లో మనిషి పరిమితులపై స్పందిస్తున్నారు. అలాంటి ఓ స్పందన ఇదీ..

 

" నేను గొప్ప, మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, మా దేశమే గొప్ప, మా స్వామీజీ మహిమాన్వితుడు, మా బాబా మహానుభావుడు, మా ప్రభువు సర్వశక్తిమంతుడు...
ఒక్క కరోనా తుఫాను ఈ భావాలన్నింటినీ దూది పింజలుగా తేల్చేసింది.

 

 

దేశాలు, మతాలూ, మంత్రాలు, అహంకారం మూర్తీభవించిన అధికారాలు, మహా మహా ఆయుధ బలప్రదర్శనలు అన్నీ ఉత్తవేనని తేలిపోతున్నది. ఇవేవీ ఆపలేని మృత్యువొకటి వెంటపడితే ఏమీ చేయలేని నిస్సహాయత ఎదురుపడితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తున్నది.

 


ఇది తాత్కాలికమే కావొచ్చు. ఈ మృత్యువును జయించాల్సింది మళ్ళీ మనిషే. మనిషే మహా శక్తిమంతుడు, ప్రకృతి అంతకంటే శక్తిమంతమైనది. రేపు ఈ మనిషే మందు కనిపెట్టవొచ్చు. మళ్ళీ అహంకరించి చెలరేగవచ్చు. కానీ ఈ కాల చక్రం పదే పదే గుర్తు చేసేది ఒకటే. నన్నెప్పుడూ జయించలేరని. ఒదిగి ఒదిగి జీవించమని.”

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: