అక్టోబర్ 7 నుండి దుర్గామాత స్పెషల్ పండగ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రి రోజుల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. కొంతమంది మొదటి, అష్టమి రోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం పాటించని వారు నవరాత్రి నియమాలన్నింటినీ పాటిస్తారు. ఈ రోజుల్లో ఇంట్లో స్వచ్ఛత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉపవాసం పాటించని వ్యక్తులు ఉల్లిపాయ, వెల్లుల్లిని తొమ్మిది రోజులు తినడం మానేస్తారు. కొంతమందికి దీనికి కారణం ఏంటో అస్సలు తెలియదు. ఇతరులను చూసి నియమాలను పాటిస్తూ ఉంటారు. నవరాత్రి సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినొద్దో తెలుసుకుందాం.

ఉల్లిపాయ, వెల్లుల్లిలోని లక్షణాల కారణంగా ఇది మనస్సును చంచలం చేస్తుంది. ఒకే చోట కేంద్రీకరించలేరు. ఉల్లిపాయ, వెల్లుల్లిని తినడం వల్ల ఇంద్రియ శక్తి మేల్కొలుపు ప్రారంభమవుతుంది. మనస్సు ఆనందం, విలాసాల వైపు పరుగులు తీస్తుంది. ఉపవాసం సమయంలో ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, మనస్సును అదుపులో పెట్టుకోవాలి. తొమ్మిది రోజులు ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదని చెప్పటానికి కారణం ఇదే.

పురాణాల ప్రకారం, విష్ణువు మహాసముద్రాన్ని మథిస్తున్న సమయంలో దేవతలకు అమృతం దక్కుతుంది. అప్పుడు స్వరభాను అనే రాక్షసుడు దేవతల మధ్య కూర్చుని అమృతాన్ని, తేనెను సేవించాడు. విష్ణువుకు ఈ విషయం తెలిసి అతని మొండెం, తలను వేరు చేశాడు. అప్పటి నుంచి స్వరభానుని తలను రాహు అని, మొండెంను కేతు అని పిలుస్తున్నారు. అయితే ఆ రాక్షసుడి మొండెం నుంచి తలను వేరు సి చేసినప్పుడు రెండు చుక్కల తేనె భూమిపై పడింది. దాని నుండి ఉల్లిపాయ, వెల్లుల్లి తయారయ్యాయట. అమృతం నుండి ఉద్భవించినందున ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివని భావిస్తారు. కానీ అవి రాక్షసుల వల్ల వచ్చాయి కాబట్టి పూజా సమయంలో వాటిని దూరం పెడతారు. నవరాత్రుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు అంటే ఇదే రీజన్.

మరింత సమాచారం తెలుసుకోండి: