వ్యక్తిగత జీవితం అయినా వృత్తిపరమైన జీవితం అయినా సరే మనం విజయం సాధించాలంటే చాణిక్యనీతి అనేది అన్ని కాలాల్లోనూ చక్కని బోధన అని చెప్పవచ్చు. తన యొక్క శిష్యులకు బోధించినటువంటి ముఖ్య విషయం నోరు అదుపులో ఉంచుకోవడం. మనిషి తన యొక్క జీవితంలో తలదించుకోవాల్సిన సందర్భాలూ ఉంటాయి. తల ఎత్తుకొని తిరిగే సందర్భాలు కూడా ఉంటాయి. కొన్ని ఎదురుతిరి గవలసిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే మనం ఏ సందర్భంలో ఎవరితో ఎలా వ్యవహరించినా సరేగాని జీవితంలో ఆ ఇద్దరు వ్యక్తులపై మాత్రం నోరు జరగకూడదని వారిని తిట్టడం మరియు దూషించడం దుర్భాషలాడటం వంటివి అస్సలు చేయకూడదని అన్నాడు చాణక్యుడు.

మరి ఆ ఇద్దరు ఎవరో తెలుసా ఒక్కటి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు.  వారిని చెడు మాటలతో అసలు హింసించ కూడదు అని చెప్పాడు. కన్న తల్లిదండ్రులను  హింసిస్తే అది  శాపంగా మారుతోందని చెప్పాడు. తల్లిదండ్రులపై ఎప్పుడూ కూడా పరుషంగా మాట్లాడవద్దని తెలియజేశారు. ఈ మాట అన్ని తరాల వారికి వర్తిస్తుందని  అన్నారు. మనం ఎవరి దగ్గర మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేది ఎప్పుడూ గుర్తుంచుకొని మాట్లాడాలని చాణిక్యుడు హెచ్చరించారు. మనం ఒక్కసారి విడిచిన బాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం, అలాగే మనం మాట్లాడిన మాటలను మళ్లీ వెనక్కి తీసుకోలేం. దీని యొక్క పర్యవసానం భరించక తప్పదని చాణిక్యుడు అన్నారు. బాగా కోపం వచ్చినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులే పిల్లలకు టార్గెట్  అవుతారు.

 ఈ సమాజంలో సహజంగా జరిగే పని, ఈవిధంగా ఎవరిపై కోపం చూపించాలో తెలియక తల్లిదండ్రులపై కోపానికి వచ్చే వారు చాలామంది సమాజంలో ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లోనే కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి పిల్లల ఉద్దేశం అది కాకపోయినా ఆగ్రహాన్ని అనచుకోవాలంటే ఆ విధంగా మాట్లాడతారు. చెడ్డ ఉద్దేశం లేకపోయినా సరే ఇలాంటి మాటలు మాట్లాడితే దాని పర్యవసనాలు అన్ని మనం జీవితంలో అనుభవించక తప్పదని చాణక్యుడు తన బోధనల ద్వారా తెలియజేశారు. ఒక వ్యక్తి భౌతికంగా సంపద ద్వారా ఉత్తములు కాలేరని, డబ్బులు హోదా అతని ఖ్యాతిని  పెంచలేవని, సంపద కన్నా ఆ వ్యక్తిని ఇన్ని చేతులు ఆశీర్వదించాలని ఇది మాత్రమే ముఖ్యమని చాణిక్యుడు తెలియచేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: