రేపే ఆడి కృత్తిక.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు ఆరాధిస్తే ఎంతో విశేషమైన ఫలితాలు అందుతాయి.  ఆషాడ మాసంలో కృత్తిక నక్షత్రం వచ్చే రోజునే ఈ ఆడికృతిక.  దీనిని ఆడికృతిక అంటారు . ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు . ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరు పూజించిన సరే ఖచ్చితంగా ఆయన వారి కోరికలను నెరవేరుస్తారు అన్న నమ్మకం ఎప్పటినుంచో వస్తుంది . ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నియమనిష్టలతో పూజలు చేయాలి . ఆడి కృత్తిక ఉదయమే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిల్లు శుభ్రంగా తుడుచుకొని .. దేవుడు పటాలు పసుపు కుంకాల తో పూలతో అలంకరించుకొని .. ధూప దీపాలతో నైవేద్యాలతో ఆయనను పూజించాలి .


మరి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చలిమిడి అంటే చాలా చాలా ఇష్టం.  చలిమిడితో ఆవు నేతితో మూడు వత్తులు వేసి దీపం పెట్టి.. శివ కుటుంబమైన శివుడు.. పార్వతి దేవి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామీ ముందు దీపం  వెలిగించి చిమిలిని నైవేద్యంగా పెట్టి పూజిస్తే మహా మహా మంచి పుణ్యం లభిస్తుంది అంటున్నారు పండితులు . పచ్చిపాలు , వడపప్పు , అరటి పండ్లు తాంబూలం లో ఇవన్నీ నివేదించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ సూత్రాలతో సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం చదువుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ తరువాత నక్షత్ర దర్శనం చేసుకున్న ప్రసాదముగా పిండి దీపమును చిమ్మిలి ..వడపప్పు .. అరటిపండు స్వీకరించాలి .



ముందు రోజు రాత్రి మరియు ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి . ఇలా చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి విశేషా అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటివారు.. ఈ రోజున ముడుపు కట్టుకున్న మంచిది. జంట నాగమ్మలకు పాలు పోసిన మంచిది . ఉద్యోగాలు రాని వాళ్ళు కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు.. డబ్బు నిలవడం లేదు అని బాధపడేవారు .. ఎవరైనా సరే ఆడి కృతికరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ ఆరాధిస్తే కచ్చితంగా ఆయన ఆ కోరికలు నెరవేరుస్తారు అని నమ్మకం ఎప్పటినుంచో ఉంది .



సుబ్రహ్మణ్య స్వామీ ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఇది తమిళనాడు లో ఎంతో ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ . మన తెలుగు రాష్ట్రాలలో కూడా కొంతమంది బాగా శ్రద్ధగా జరుపుకుంటారు. ఈసారి ఆడి కృతిక ఆదివారం వచ్చింది.  చాలామంది ఉదయం పూట దీపం వెలిగించేసుకొని . సుబ్రమణ్య స్వామికి పూజ చేసుకొని మధ్యాహ్నం-సాయంత్రం సమయాలలో మాంసాహారం బయట తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.  కానీ అలా చేయకూడదు . అది తప్పు . ముందు రోజు రాత్రి నుంచి మరుసటి రోజు రాత్రి వరకు అసలు మాంసాహారము అనేది ముట్టకూడదు . బ్రహ్మచార్యాని కూడా పాటించాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: