న్యూసౌత్ వెల్స్ తరఫున ఆడిన కిపాక్స్ .. ఆస్ట్రేలియా 22 వ టెస్టు లో ప్రాతినిధ్యం వహించాడు. మే 25 న 1897 న సిడ్నీలో జన్మించిన కిపాక్స్,1927-28 లో సిడ్నీలో న్యూజిలాండ్ లో జరిగిన మ్యాచ్లో 10వ వికెట్ కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంతవరకు ఆడిన క్రికెట్ చరిత్రలో ఈ వికెట్ కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం కావడం విశేషం.కిపాక్స్, హల్ హుకర్ తో కలిసి ఐదు గంటలలో 307 పరుగులు జోడించాడు. ఇందులో కిపాక్స్ చేసిన పరుగులు 240. అతను ఆడిన అరవై ఒక్క షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లల్లో 70కి పైగా సగటుతో కిపాక్స్ 6096 పరుగులు చేశాడు.