ప్రస్తుతం భారత జట్టులో నటరాజన్ ఉత్తమ బౌలర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ మొదలుకొని  తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని‌ సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఐ‌పి‌ఎల్ తరువాత ఆస్ట్రేలియా టూర్ కు బయలుదేరిన టీమిండియా మొదట జరిగిన వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి  అరంగేట్రం చేశాడు నటరాజన్‌. ఆరంగేట్ర సిరీస్ తో తన సత్త ఏంటో నిరూపించుకొని అందరి ప్రశంశలు అందుకున్నాడు.

ఆ తరువాత జరిగిన టీ20 సిరీస్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక అలాగే టెస్టు క్రికెట్‌లోకి అనూహ్యంగా దూసుకొచ్చి తనకు ఏ ఫార్మాట్‌ అయినా ఒకటేనని చాటి చెప్పాడు. అయితే నటరాజన్ ఈ ఆసీస్ టూర్ లో ఒక అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ‌ నెట్‌ బౌలర్‌గా ఆసీస్‌ పర్యటనకొచ్చిన నట్టూ..ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

డిసెంబరు 2న ఆస్ట్రేలియాతో వన్డేలో అంతర్జాతీయ కెరీర్‌కు శ్రీకారం చుట్టిన 29 ఏళ్ల నటరాజన్‌..ఆ మ్యాచ్‌లో 70 పరుగులకు రెండు వికెట్లు సాధించాడు. అనంతరం టీమిండియా 2-1తో నెగ్గిన టీ20 సిరీ్‌సలోనూ ఆడిన నటరాజన్‌ మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లతో సత్తా చాటాడు. ఇక టెస్ట్ లలో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మొత్తానికి నటరాజన్ ఎంట్రీ తో భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: