ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా నిరాశపరిచింది. సెమీ ఫైనల్ కూడా చేరకుండానే వెనుదిరిగింది. కానీ ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టి20 సిరీస్ లో మాత్రం శుభారంభం చేసింది టీమిండియా. ఇటీవలే న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుమూడవ స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా రాణించడంతో టీమ్ ఇండియా జట్టు అలవోకగా విజయ తీరాల వైపు పరుగులు పెట్టింది.


 ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన అందరినీ కట్టిపడేస్తుంది అనే చెప్పాలి. మూడవ స్థానంలో మైదానంలోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు మొత్తంగా 62 పరుగులు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఇక నిన్న జరిగిన టి20 మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ తన కోసం తన మూడవ స్థానాన్ని త్యాగం చేసాడని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చాడు.


 ప్రపంచ కప్ లో తనదైన మార్కు చూపించాలి అని అనుకున్నాను. కానీ వెన్నునొప్పి కారణంగా న్యూజిలాండ్లో జరిగిన  మ్యాచ్లో ఆడ లేక పోయాను. ఇక అది నాకు ఎంతగానో నిరాశ కలిగించింది అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక తాను అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే తన కోసం ఏకంగా కోహ్లీ తన మూడవ స్థానాన్ని త్యాగం చేసాడని సూర్యకుమార్ యాదవ్ గుర్తు చేసుకున్నాడు. తనకు మూడవ స్థానం ఇచ్చి కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు.. ఇక వరల్డ్ కప్ లో కూడా మూడవ స్థానాన్ని వదులుకొని తనను బ్యాటింగ్ కి పంపించాడూ. కోహ్లీ తన పట్ల వ్యవహరించిన తీరును ఎప్పటికీ మరిచిపోలేను అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: