ఐపీఎల్ 15 సీజన్ కోసం ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ పదిహేనవ సీజన్లో ఏకంగా మునుపెన్నడూ లేని విధంగా పది జట్లు ఐపీఎల్లో పోటీ పడుతున్నాయి. ఇటీవలే కొత్తగా ఐపీఎల్లో కి రెండు జట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇక ఈసారి ఐపీఎల్ సీజన్ లో పోటీ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరం గా మారిపోయింది. అంతేకాకుండా మొన్నటి వరకూ ఏ జట్టు ఎలా రాణిస్తుంది అనే దానిపై ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉండేవి. కానీ ఇప్పుడు మెగా వేలం  కారణంగా  ఏ ఆటగాడు ఈ జట్టులో కి వెళ్తాడు అన్నదానిపై కూడా క్లారిటీ లేకుండా పోయింది. దీంతోఈసారి ఐపీఎల్ కాస్త మరింతహాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక మరికొన్ని రోజుల్లో మెగా వేల నిర్వహించేందుకు బిసిసిఐ ప్లాన్ చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఐపీఎల్ లో ఉన్న ఎనిమిది జట్లు తమతోపాటు రిటైన్ చేసుకునే నలుగురు ఆటగాళ్ల జాబితాను సమర్పించాలి అంటూ బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.  దీంతో ఏ జట్టు ఏ ఆటగాళ్లను తమతో అంటిపెట్టుకోపోతున్నది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శిఖర్ ధావన్ కు ఊహించని షాక్ ఇవ్వబోతుందట. గత రెండు ఐపీఎల్ సీజన్లలో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.


 ఇలా జట్టుకు అరుదైన విజయాలను అందించిన శిఖర్ధావన్ ను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రాబోయే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహించనున్నాడు. అయితే ఇక ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోవాలని ఆటగాళ్ల జాబితాలో శిఖర్ధావన్ పేరు లేదట. కెప్టెన్ రిషబ్ పంత్, యువ ఆటగాడు పృథ్వీ షా, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పేర్లు  జాబితాలో ఉండగా మరో విదేశీ ఆటగాడి పేరు కూడా ఇందులో చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్  తరఫున అద్భుతమైన ప్రదర్శన చేసిన శిఖర్ ధావన్ కు ఊహించని షాక్ తగిలినట్లే అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: