సాధారణంగా ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్ల మధ్య అప్పుడప్పుడు వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకరిని ఒకరు రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కేవలం ఆటగాళ్ల మధ్య మాత్రమే కాదు  మ్యాచ్ లో కొన్ని నిర్ణయాల కారణంగా అంపైర్ల తో  కూడా గొడవ పడటానికి దూసుకు పోతూ ఉంటారు ఆటగాళ్లు. ఇక ఇలా అంపైర్ ఆటగాళ్ల మధ్య జరిగే గొడవ కొన్ని కొన్ని సార్లు శ్రుతిమించుతు ఉంటుంది. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే కేవలం క్రికెట్ మ్యాచ్లో మాత్రమే కాదు అటు టెన్నిస్ లో కూడా ఇలాంటి వివాదాలు జరుగుతూ ఉండటం చూస్తూ ఉంటాం. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ జరుగుతోంది. ఇక గ్రాండ్ స్లామ్ లో ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు డానిల్ మెద్వదేవ్ అంపైర్  తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోరు పారేసుకున్నాడు. ఎంతో కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో తనని తాను నియంత్రించుకోలేక పోయినా డానిల్ మెద్వదేవ్ ఇలా అంపైర్ను బూతులు తిట్టాడు. ఇది దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ప్రత్యర్థి ఆటగాడు రూల్స్ కు విరుద్ధంగా స్టాండ్స్ లో ఉన్న తండ్రి వద్ద కొన్ని సలహాలు తీసుకున్నాడు.



 ఇక ఇది గమనించిన డానిల్ మెద్వదేవ్.. చైర్ లో కూర్చున్న అంపైర్ ను చూస్తూ తన తండ్రి సలహా తీసుకుని కోడ్ ఆఫ్ వై లేషన్  ను ఉల్లంఘించాడు. నీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించాడు. ఇక అంపైర్ సమాధానం చెప్పబోతుండగా  వినిపించుకోకుండా మరోసారి గట్టిగా అరిచాడు. అతనికి  తన తండ్రి ఏ పాయింట్ గురించి అయినా మాట్లాడొచ్చు.. ఆర్ యూ స్టుపిడ్.. అతని తండ్రి ఏ పాయింట్ గురించి అయినా మాట్లాడొచ్చు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు.. గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్లో ఇంత బ్యాడ్ ఎంపైర్   ఉంటారా.. ఓ మై గాడ్ నీతో మాట్లాడుతున్న నన్ను చూడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఇదంతా కెమెరాల్లో రికార్డ్ అయింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం డానిల్ మెద్వదేవ్ అంపైర్ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాడు. కాగా ఈ మ్యాచ్లో చివరికి డానిల్ మెద్వదేవ్ విజయం సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: