
కాసేపటి క్రితం వరకు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ కు సారధిగా ఎవరిని నియమించాలి అన్న విషయంపై అటు ఫ్రాంచైజీ, కోచింగ్ స్టాఫ్ తర్జభర్జనలు పడ్డారు. కెప్టెన్ ఎవరు కానున్నారు అన్న దానిపై నిన్నటి వరకు ముగ్గురి పేర్లు వినిపించాయి. అందులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ మరియు దినేష్ కార్తీక్ పేర్లు వినిపించాయి. కానీ విరాట్ కోహ్లీ ని పలు మార్లు అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దినేష్ కార్తీక్ ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ కి కెప్టెన్ గా వ్యహరించిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఇతను సక్సెస్ కాలేకపోయాడు. అందుకే ఇతనిని ఎంచుకోవడానికి ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
ఇక ఆఖరి ఛాయస్ గా మిగిలింది ఫాఫ్ డుప్లిసిస్ మాత్రమే. ఇతనికి కెప్టెన్ గా అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన రికార్డు ఉండడంతో ఆర్సీబీ ఇతనిని కెప్టెన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. డుప్లిసిస్ కెప్టెన్ గా ఆడిన 115 మ్యాచ్ లలో 81 మ్యాచ్ లను గెలిపించాడు. ఇప్పుడు ఐపీఎల్ లో బెంగుళూరు జట్టుకు కెప్టెన్ గా టైటిల్ ను అందించగలడా అన్నది చూడాల్సి ఉంది.