ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో ఏడాది అంతకుమించి అనే రేంజ్ లోనే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ప్రతి విషయంలో కూడా ప్రేక్షకుల అంచనాలు తారుమారు అవుతూ ఊహించని జట్టుకు విజయం వరిస్తుంది  దీంతో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోయి మరి విచ్చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇలా ఐపీఎల్ మ్యాచ్లు వీక్షిస్తున్న ప్రేక్షకులను ఈసారి అత్యుత్తమ జట్టు ఏది అని అడిగితే అందరూ చెప్పే సమాధానం గుజరాత్ టైటాన్స్ అని. ఎందుకంటే ఎవరూ ఊహించని రీతిలో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది గుజరాత్ టైటాన్స్.


 గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా ఏం రాణిస్తాడు లే అనుకున్నారు అందరు..  కెప్టెన్సీలో అనుభవం లేని హార్దిక్ పాండ్యా  జట్టును ముందుకు నడిపించగలడా అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అదే హార్దిక్ పాండ్య తన వ్యూహాలతో జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడినా తొమ్మిది మ్యాచ్ లలో 8  మ్యాచ్ లలో విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్. ఈ క్రమంలోనే ఇటీవల హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై సునీల్ గవాస్కర్ ప్రశంసల కురిపించాడు. హార్దిక్ పాండ్యా నాయకుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే బ్యాట్స్మెన్గా కూడా వృద్ధి చెందుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.



 హార్దిక్ పాండ్యాను చూస్తున్నప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ గుర్తుకు వస్తోందని తెలిపాడు గవాస్కర్. టి20 లీగ్ 2013 సీజన్ మధ్యలో ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టాడు  అప్పటి నుంచి అతని బ్యాట్ నుంచి టీ-20లో 40, 50, 60 లు చూస్తూనే ఉన్నాం. ఇక రోహిత్ సెలక్షన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాంటి పోలికలు హార్దిక్ పాండ్యాలో కూడా మనం చూడవచ్చు. ఇద్దరు కూడా మంచి ఫీల్డర్లే. ఇలాంటి క్వాలిటీస్ గుజరాత్ ను టాప్ లో నిలబెట్టేలా  చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గత ఏడాది వరకు ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్రౌండర్ గా కొనసాగిన హార్దిక్ ఈ ఏడాది మాత్రం గుజరాత్ కి ప్రాతినిధ్యం వహిస్తూ కెప్టెన్గా  కొనసాగుతున్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: