ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా పర్పుల్ క్యాప్ సాధించిన ప్లేయర్ గా రికార్డు సృష్టించారు చాహల్. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతంగా రాణించి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడబోయే టీ20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్లో బాగా రాణించిన చాహల్  దక్షిణాఫ్రికాతో సిరీస్ లో మాత్రం విఫలం అవుతూ ఉండడం గమనార్హం. కేవలం చాహల్ మాత్రమే కాదు భారత బౌలింగ్ విభాగం మాత్రం దారుణంగా వైఫల్యం చెందుతుంది.



 ఇలా భారత పిచ్లపై అవగాహన ఉన్న బౌలర్లు సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లను కట్టడి చేస్తారు అనుకుంటే భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే వరుసగా రెండు మ్యాచ్లలో విఫలమైన చాలు వికెట్లు తీయక పోగా కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.. ఇదే విషయం పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. చాహల్ తన వేగాన్ని మార్చుకోవడం ఎంతో అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. నేను టైట్ గా బౌలింగ్ చేస్తా అని చాహల్ అనుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం అది జరగడం లేదు.


 ఏకంగా నాలుగు ఓవర్లు వేసి 50 పరుగులు సమర్పించు కున్నాడు. చాహల్ బాగా రాణించి ఉంటే మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉండేది. ఇక చాహల్ 50 పరుగులు ఇవ్వడమే కాదు ఒక వికెట్ కూడా తీయక పోవడం  ఆందోళన కర విషయం అంటూ చెప్పుకొచ్చాడు. చాహల్ తన వేగాన్ని తగ్గించి కొన్ని స్లొ బంతుల తో బ్యాట్స్ మెన్ లను టెంప్ట్  చేయాలి. ఈ క్రమం లో బ్యాట్స్మెన్లు 1,2 సిక్సర్లు కొట్టిన పెద్దగా నష్టం ఉండదు.  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో చాహల్ బౌలింగ్లో వేగం ఉంది తప్ప వైద్యం మాత్రం కనిపించడం లేదు అంటూ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: