
మైదాన నలువైపులా ఎంతో అలవోకగా అదిరిపోయే సిక్సర్లు కొట్టే సూర్య కుమార్ యాదవ్ ఎప్పుడు తన ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే తన ఆట తీరుతో ఏకంగా టి20 రాంగింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నాడు. అయితే ఇప్పటివరకు అటుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో మాత్రం సూర్యకుమార్ అరంగేట్రం చేయలేదు. అయితే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో మాత్రం సూర్యకుమార్ సుదీర్ఘమైన ఫార్మాట్లోకి రాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.
అయితే ఇక టెస్ట్ జట్టు కోసం సూర్యకుమార్ ని ఎంపిక చేసినప్పటికీ అతనికి తుది జట్టులో చోటు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఆస్ట్రేలియా తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఇక సూర్యకుమార్ టెస్ట్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్నారు. దీంతో సూర్యకు లైన్ క్లియర్ అయినట్లే అని తెలుస్తుంది. ఇక ఈ విషయంపై బీసీసీఐ సెలక్టర్ శ్రీధరన్ శరత్ కూడా హింటిచ్చాడు. బౌలర్లపై ఆటాక్ చేస్తూ ప్రత్యర్థి చేతనుంచి మ్యాచ్ను లాగేసుకునే సత్తా సూర్యకు ఉందని.. తుది జట్టులో అతనికి చోటు దక్కొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు బిసిసిఐ సెలెక్టర్.