
అయితే ఇప్పటికే వన్డే, టెస్ట్ ఫార్మట్ లో సెంచరీ చేసిన గిల్.. ఇక ఇటీవలే మూడో టి20 మ్యాచ్ లో సెంచరీ ద్వారా ఇక తన కెరియర్ లో మొదటి సెంచరీ నమోదు చేశాడు. అయితే ఇక ఈ సెంచరీ తో ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. అయితే మిగతా బ్యాట్స్మెన్లు అందరూ విఫలమైన సమయంలో ఎక్కడ ఒత్తిడికి గురి కాకుండా అతను ఆడిన విధానం షాట్ సెలక్షన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ మాజీ ఆటగాళ్లు కూడా శుభమన్ గిల్ ప్రదర్శన పై ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.
ఇలా తాను ఏ ఫార్మాట్లో ఆడుతున్నాను అన్న విషయం తేడా లేకుండా సెంచరీ ఇన్నింగ్స్ ఆడేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్ లో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో శుభమన్ గిల్ చేసిన మెరుపు సెంచరీపై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా శుభమన్ గిల్ సెంచరీ పై ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తు ఇక్కడే ఉంది అంటూ విరాట్ కోహ్లీ ఒక పోస్ట్ పెట్టాడు. అంటే ఇక భవిష్యత్తు స్టార్ ఎవరో కాదు అతను శుభమన్ గిల్ మాత్రమే అని అర్థం వచ్చేలా కోహ్లీ పోస్ట్ పెట్టాడు అని చెప్పాలి. కోహ్లీ నుంచి ఇలాంటి ప్రశంసా అందుకోవడంతో గిల్ సంతోషంలో మునిగిపోయాడు.