యువ ఆటగాళ్ళ తో పోల్చి చూస్తే కాస్త లేటు వయసు లోనే టీమ్ ఇండియా లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్.. వచ్చిన తక్కువ సమయం లోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని టీమ్ ఇండియా లో క్రియేట్ చేసుకున్నాడు. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇక అతను ఫ్యూచర్ స్టార్ అన్న నమ్మకాన్ని అందరి లో కల్పించాడు. ముఖ్యం గా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్ ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తున్నాడో అన్నది ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.


 తన అద్భుతమైన ఆట తీరుతో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో నయా 360 డిగ్రీస్ ప్లేయర్ గా మారి పోయాడు సూర్య కుమార్ యాదవ్. ఈ క్రమం లోనే టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఏ మ్యాచ్ ఆడిన కూడా అందులో సూర్య కుమార్ స్థానం సుస్థిరం అయింది అని చెప్పాలి. అయితే మరికొన్ని రోజుల్లో టీమ్ ఇండియా అటు ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీన నాగ్పూర్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఇక ఈ మ్యాచ్ కోసం సూర్యకుమార్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.


 ఎందుకంటే ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్.. ఇక నాగపూర్ వేదికగా జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ లో సుదీర్ఘమైన ఫార్మాట్లోకి కూడా అరంగేట్రం చేయబోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే దూకుడు అయిన ఆటతీరుకు కేరాఫ్ అడ్రస్ అయిన సూర్యకుమార్ యాదవ్  టెస్టుల్లో ఎలా రాణిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఇదే విషయంపై మాట్లాడిన సూర్య కుమార్  తన ఇంస్టా స్టోరీలో ఎరుపు కలర్ బంతిని పెట్టాడు. హలో ఫ్రెండ్ నీకోసం వెయిట్ చేస్తున్న అంటూ పోస్ట్ పెట్టగా ఇది కాస్త వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: