ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టులో నాలుగు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇండియా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇరు జట్ల మధ్య కూడా వరుసగా మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయి. అయితే ఈ రెండు మ్యాచ్లలో కూడా ఆతిథ్య టీమిండియా జట్టు పూర్తి ఆధిపత్యాన్ని చెల్లాయించింది. అటు ఆస్ట్రేలియా పటిష్టమైన జట్టే అయినప్పటికీ ఎందుకో భారత పరిస్థితులను తట్టుకొని బాగా రాణించలేక పోతుంది అని చెప్పాలి. అదే సమయంలో స్వదేశీ పరిస్థితిలను బాగా వినియోగించుకుంటున్న భారత జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియాని ముప్పు తిప్పలు పెడుతుంది.


 వెరసి ఇప్పుడు వరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా అటు ఆస్ట్రేలియా జట్టు ఎక్కడ భారత్కు పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కాస్త పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం భారత జట్టు పట్టు బిగించడంతో ఇక గెలిచేందుకు ఆస్ట్రేలియాకు ఎక్కడ అవకాశం లేకుండా పోయింది. కాగా మొదటి టెస్ట్ మ్యాచ్లో 132 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా... రెండవ టెస్ట్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది అని చెప్పాలి.


 అయితే మూడో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచి ఇక సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తూ ఉంది. ఇకపోతే వరుస ఓవటములపై ఆస్ట్రేలియా హెడ్ కోచ్ గా ఉన్న ఆండ్రూ మెక్ డోనాల్డ్ స్పందించాడు. భారత్తో జరిగిన రెండు టెస్టుల్లో కూడా తమ జట్టు ఫెయిల్ అయింది అంటూ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఢిల్లీ టెస్ట్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ తీరు ఘోరంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. రెండు రోజులపాటు బాగానే ఆడినప్పటికీ మూడోరోజు ఆటలో మాత్రం పూర్తిగా తేలిపోయారు. అనవసరంగా స్వీప్ షాట్లు ఆడి వికెట్లు కోల్పోయారు అంటూ మెక్ డోనాల్డ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: