
ఇంకొన్నిసార్లు అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నవారు.. అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక జట్టును గెలిపించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు క్రికెట్లో కనుమరుగయ్యే పరిస్థితిలో ఆటగాళ్లు సైతం అవకాశాలు దక్కించుకుని అదరగొట్టడం చూస్తూ ఉంటాం. గత ఐపీఎల్ సీజన్లో కెరియర్ ముగిసిపోయింది అనుకున్న దినేష్ కార్తీక్ బెంగళూరు జట్టు తరఫున మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి అదరగొట్టాడు. ఆ తర్వాత టీమ్ ఇండియాలోకి వచ్చేసాడు. ఇక ఈ ఏడాది ఇలాగే మరో సీనియర్ ప్లేయర్ కూడా ఇరగదీసాడు అని చెప్పాలి.
ఆ సీనియర్ ప్లేయర్ ఎవరో కాదు అజింక్య రహానే. అతను ఒక టెస్ట్ ఫార్మాట్ ప్లేయర్ అని అందరూ ఒక ముద్ర వేశారు. ఇక పరిమిత ఓవర్ల ఫార్మర్ కి అతను దూరం అయ్యాడు. ఇక ఫామ్ కోల్పోవడంతో టెస్ట్ ఫార్మాట్లో కూడా అతని పట్టించుకోలేదు. అలాంటి ప్లేయర్ ను చెన్నై సూపర్ కింగ్స్ 50 లక్షలు కొనుగోలు చేసింది. ధోని అతనిపై నమ్మకం పెట్టి అవకాశం ఇస్తే అదరగొట్టాడు.ఇదే విషయంపై రహానే మాట్లాడుతూ.. ఐపీఎల్ లో నన్ను వేలంలో ఎంచుకొని నన్ను నమ్మినందుకు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ కి క్రెడిట్ దక్కుతుంది. కెప్టెన్ మహి బాయ్, కోచ్ ఫ్లెమింగ్ సీజన్ ప్రారంభానికి ముందు నాకు స్పష్టంగా చెప్పారు. నువ్వు ఎప్పుడూ ఆడిన స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉంటుందని.. నేను వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుకున్నాను అంటూ అజింక్య రహానే చెప్పుకొచ్చాడు.