
అయితే ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా టాప్ ప్లేస్ లోకి వెళ్లి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తూ ఉంది. అయితే ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియా ఎంతటి అత్యుత్తమమైన ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫైనల్లో శ్రీలంకను ఓడించి ఏకంగా ఆసియా కప్ టైటిల్ విజేతగా నిలిచింది టీం ఇండియా. అయితే ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు చిన్న గ్యాప్ లో అటు ఆస్ట్రేలియతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడటానికి సిద్ధమవుతుంది. అయితే ఆస్ట్రేలియా తో మొదటి వన్డే మ్యాచ్ కి ముందు టీమిండియాను ఒక అరుదైన ఘనత ఊరిస్తుంది అని చెప్పాలి.
నేడు ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి వన్డే మ్యాచ్ లో కంగారులను టీమిండియా ఓడించింది అంటే చాలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ ను వెనక్కినెట్టి ఇక ఈ ఫార్మాట్లో టీమ్ ఇండియా టాప్ ప్లేస్ దక్కించుకుంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పటికే టెస్ట్ లు టీ20 లలో నెంబర్ వన్ గా కొనసాగుతున్న టీమ్ ఇండియా ఇక వన్డే ఫార్మాట్లో కూడా నెంబర్ వన్ టీం గా అవతరిస్తుంది. కాగా ఇక ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డే మ్యాచ్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి కీలక ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వగా కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగబోతుంది అని చెప్పాలి.