ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కాస్త కళ్ళు పెద్దవి చేసుకుని ఎదురుచూస్తుంది ఒకే ఒక్క టోర్రి గురించి. అదేదో కాదు భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ గురించి. అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా ఈ ప్రపంచకప్ టోర్నీ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ టోర్నీలో పాల్గొనబోయే పది జట్లు కూడా ప్రస్తుతం అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్. ఇక ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో ఏ మైదానంలో ఏ ప్రత్యర్థిని ఏ రోజు ఎదురుకోబోతున్నాము అనే విషయంపై అన్ని జట్లకు ఒక క్లారిటీ వచ్చింది.


 ఈ క్రమంలోనే అందుకు అనుగుణంగానే ఇక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు అన్ని టీమ్స్ సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. ఇక వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం అటు భారత్ లో ఉన్న అన్ని వేదికలు కూడా ముస్తాబ్ అవుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ని మరింత సరికొత్తగా ప్రేక్షకులకు చేరువ చేయడానికి అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.


 వరల్డ్ కప్ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రేక్షకులకు వైవిధ్యంగా అందించేందుకు ఇప్పుడు ఐసీసీ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్ యూజర్ల కోసం వీడియో ఫీడ్ ను వర్టికల్ గా అందించబోతున్నట్లు ఐసీసీ టీవీ బృందం తెలిపింది. క్రికెట్ కవరేజీలో ఇదొక వినూత్న విధానం అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ పద్ధతి వరల్డ్ కప్ మ్యాచ్ లైవ్ ను మరింత ఇష్టపడి చూసేలా చేస్తుంది అంటూ అభిప్రాయపడింది ఐసీసీ. ఇక ఐసీసీ తీసుకొచ్చిన ఈ సరికొత్త  విధానంతో ప్రేక్షకులకు మ్యాచ్ లైవ్ గా చూడటం మరింత సులభతరం కానుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc