అవును, మీరు విన్నది నిజమే. ఆ మాటలు అన్నది ఓ సామాన్యమైన వ్యక్తి కాదు. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తనదైన రీతిలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‍ని ఆకాశానికేత్తేశాడు. ఎప్పుడూ ధోనిపై తన కోపాన్ని వ్యక్తపరిచే గంభీర్.. కెప్టెనీ విషయంలో మహీని అతగాడు కీర్తించాడు. ఒకప్పుడు ఈ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై పలుసార్లు విమర్శలు చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా గౌతమ్ గంభీర్ ఇటీవల కాస్త రూటు మార్చి తరచూ ధోనీని ప్రసంశిస్తుండడం విశేషం. ఆమధ్య గంభీర్ జట్టు కోసం బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానాన్ని మహీ త్యాగం చేశాడని, ఈ క్రమంలో జట్టు కోసం రికార్డులను ధోనీ పట్టించుకోలేదని పొగిడాడు.

కాగా ఇప్పుడు మరోసారి ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. కెప్టెన్సీ రికార్డుల విషయంలో భారత క్రికెట్లో  ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగలేరని గంభీర్ బల్లగుద్ది మరీ చెప్పాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 3 ఐసీసీ ట్రోఫీలను గెలిచిందని, కెప్టెన్గా  ఇంత కంటే ఘనతను భారత క్రికెట్లో  ఎవరూ సాధించలేరని తాను అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ధోనీ గురించి స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన వీడియోలో గంభీర్ ఈ మాటలు చెప్పడం గమనార్హం.

ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ... “చాలా మంది కెప్టెన్లు వున్నారు, అదేవిధంగా వస్తున్నారు. వెళుతున్నారు. కానీ ధోనీ కెప్టెన్సీ, కెప్టెన్సీ రికార్డులను భారత క్రికెట్లో  ఎవరూ సమం చేయలేరని నేను భావిస్తున్నాను. టెస్టుల్లో నంబర్ వన్ పొజిషన్ కానీ, విదేశాల్లో సిరీస్లుి కానీ గెలవొచ్చు. కానీ 3 ఐసీసీ ట్రోఫీలు.. అందులో 2 ప్రపంచకప్లుస, ఓ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలు ధోనీ ఖాతాలో ఉన్నాయి. ఇవి మరెవ్వరికీ ఇప్పట్లో సాధ్యం కాదు. ఇంతకంటే గొప్ప విజయాలు ఏవీ ఉండవు” అని గంభీర్ ఈ సందర్బంగా చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: