అయితే స్వదేశంలో ఉన్న పిచ్ లపై ఉన్న అనుభవాన్ని మొత్తం అటు భారత ఆటగాళ్లు ఇక వరల్డ్ కప్ లో చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం వరల్డ్ కప్ లో టీమిండియా తిరుగులేని జట్టుగా మారిపోయింది. అంతా బాగానే ఉంది కానీ భారత జట్టు ప్రస్తుతం ఇలా వరుస విజయాలు సాధిస్తూ ఉంటే అటు పాకిస్తాన్ మాజీలు కొంతమంది చూసి అసలు ఓర్వలేక పోతున్నారు. కొంతమంది భారత జట్టు ప్రదర్శన పై ప్రశంసలు కురిపిస్తుంటే.. ఇంకొంతమంది మాత్రం ఏకంగా దారుణంగా విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా ఏకంగా భారత క్రికెటర్లకు అందరికీ ఇచ్చిన బంతి కాకుండా ప్రత్యేకమైన బంతులు ఇస్తున్నారని అందుకే వారికి ఎక్కువ స్వింగ్ లభిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ విషయంపై భారత బౌలర్ షమి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సిగ్గుపడండి ఆటపై ఫోకస్ చేయండి. ఇలాంటి ఫాల్తూ బక్వాస్ మాటలు బంద్ చేయండి ఐసిసి ప్రపంచ కప్ లోకల్ టోర్నమెంట్ కాదు ఇదివరకు మీరు ఇలాంటి కామెంట్ చేస్తే వసీం అక్రమే ఖండించారు. మీ దేశ ఆటగాడిపై మీకు నమ్మకం లేకపోతే ఎలా అని ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు షమీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి