దీంతో కొంతమంది కుటుంబంతో కలిసి టీవీల ముందు కూర్చుని.. ఈ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తూ ఉంటే.. ఇక ఈ ఫైనల్ ఉత్కంఠను స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలని ఎంతోమంది యూత్ అటు పలుచోట్ల పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లను చూడటం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వేళ.. తెలుగు క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక పండగ లాంటి వార్త అందింది. ఏకంగా నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
ఇది నిజంగా క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా పండగ లాంటి వార్త అని చెప్పాలి. 13 ఉమ్మడి జిల్లాల కేంద్రంలో స్క్రీన్స్ ఉంటాయని.. ప్రవేశం ఉచితం అంటూ పేర్కొంది. ఇక ప్రతి చోట కనీసం 10,000 మంది కూర్చొని మ్యాచ్ చూసేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. మొత్తంగా 2 లక్షల మంది ఇలా వివిధ ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్ లను చూస్తూ మ్యాచ్ ఎంజాయ్ చేసేలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఫుడ్ కోర్ట్, డీజే, స్పెషల్ లైటింగ్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నామని.. ఏకంగా స్టేడియంలో చూసిన ఫీలింగ్ కలిగేలా చూసుకుంటున్నాము అంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చెప్పుకొచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి