
అయితే సాధారణంగా క్రికెట్లో రిటైర్మెంట్ వయసు ఏది అంటే 40 ఏళ్ళు అని చెబుతారు క్రికెట్ ప్రేక్షకులు. ఎందుకంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏ క్రికెటర్ కూడా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగడానికి ఇష్టపడరు. దాదాపు 40 ఏళ్ళు సమీపిస్తున్న సమయంలో మెల్లిగా ఒక్కో ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఇక చివరికి అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది ఆటగాళ్ళు మాత్రం అతి తక్కువ వయస్సులోనే రిటర్మెంట్ ప్రకటిస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి. అవకాశాలు రాక కొంతమంది రిటైర్మెంట్ ప్రకటిస్తుంటే ఇక ఒత్తిడిని తట్టుకోలేక ఏదో ఒక ఫార్మాట్ కు పరిమితం కావాలి అనే ఉద్దేశంతో ఇంకొంతమంది రిటైర్మెంట్ ఆలోచన చేస్తున్నారు.
ఇప్పుడు ఒక 32 ఏళ్ల క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు ఇలాగే షాక్ ఇచ్చాడు. వెస్టిండీస్ క్రికెటర్ షేన్ డవ్రిచ్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ 32 ఏళ్ళ వికెట్ కీపర్ వెస్టిండీస్ తరఫున 35 టెస్టులు ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. ఇక టెస్టుల్లో 1570 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు 9 హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని రికార్డులు బాగున్నాయి అని చెప్పాలి. ఏకంగా 118 మ్యాచులు ఆడిన షేన్ డవ్రిచ్ 5027 పరుగులు చేశాడు. కొంతకాలం నుంచి అతనికి జట్టులో చోటు లేకపోవడంతో నిరాశతో రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తుంది.