ప్రస్తుతం భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ లో ఆడబోతుంది. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ లో బరిలోకి దిగి t20 సిరీస్ ను ముగించుకుంది. అయితే t20 సిరీస్ ను 3-0 తేడాతో గెలుచుకొని సొంత దేశంలోనే శ్రీలంక జట్టుకు షాక్ ఇచ్చిన టీమిడియాకు.. ఇక అటువెంటనే ప్రారంభమైన వన్డే సిరీస్ లో మాత్రం బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే మొదటి వన్డే మ్యాచ్ లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఇక మ్యాచ్ టై గానే ముగిసింది. కనీసం రెండో మ్యాచ్ లో ఆయన టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుంది అని అందరు అనుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్లో కూడా ఓడిపోయింది అని చెప్పాలి.  కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా జట్టును గెలిపించేందుకు తమ వంతు సహకారం అందించలేకపోయారు. 75/0 తో పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా 230 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రెండో వన్డేలో 97/0 పటిష్టంగా కనిపించిన భారత జట్టు 208 పరుగులకే చాప చుట్టేసింది. రోహిత్ ఔట్ అవ్వగానే మిగతా బ్యాటింగ్ విభాగం మొత్తం ఏకంగా పేక మెడల కూలిపోతూ ఉంది. దీంతో రెండో వన్డే మ్యాచ్లో ఓటమిని అసలు అభిమానులు జీవించుకోలేకపోతున్నారు.


 అయితే నేడు మూడో వన్డే మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మూడో వన్డే మ్యాచ్లో భారత జట్టు తప్పకుండా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు టీమ్ ఇండియా ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పటికే ఒక మ్యాచ్ టైగా ముగియడం.. రెండో మ్యాచ్లో ఓటమితో ఇక అటు శ్రీలంక జట్టు 1-0 తేడాతో ఆదిక్యంలో కొనసాగుతుంది. ఇక నేడు జరగబోయే మ్యాచ్లో గెలిస్తే.. సిరీస్ టై గా ముగుస్తుంది  లేదంటే ఇక శ్రీలంక చేతుల్లోకి వన్డే సిరీస్ వెళ్లే అవకాశం ఉంది అని చెప్పాలి. ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: