టాలీవుడ్ లో యాంకర్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది సుమ.. రాజీవ్ కనకాల భార్యగా అందరికి సుపరిచయమైన సుమ ఇప్పుడు సుమ భర్త రాజీవ్ కనకాల అన్న రేంజ్ కి వెళ్ళిపోయింది.. ఆమె ఏ షో లో ఉంటే ఆ షో లో నవ్వులు పూస్తాయి. కామెడీ పండుతుంది.. వచ్చే పార్టిసిపెంట్స్ కన్నా ఎక్కువ కామెడీ ఈమెనే చేస్తుంది. అందుకే ఆమెను తమ షో లో పెట్టుకోవడానికి అందరు నిర్వాహకులు ఆసక్తి చూపుతుంటారు. సుమ ఉంటేనే షో హిట్ అవుతుంది అన్న రేంజ్ కి ఆమె క్రేజ్ వెళ్ళిపోయింది..