మా
టీవీ లో
సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఎందుకంటే ప్రేక్షకుల ఆదరాభిమానాలను అంతగా అందుకుంది.కార్తీక దీపం సీరియల్ సృష్టించిన రికార్డుల.. సృష్టిస్తోన్న సంచలనాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ రెండూ ఒకే చోట కనిపిస్తే అది కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. తాజాగా
సుమహోస్ట్‌గా వస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల అయ్యింది. ఆ ప్రోమో లో కార్తీక దీపం సీరియల్ యూనిట్ హైలెట్ గా నిలిచింది.
స్టార్ట్ మ్యూజిక్ అనే ఈ షోను మొదటగా ఝాన్సీ నిర్వహించింది. కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఆ తరువాత
శ్రీముఖి నడిపించింది. స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అంటూ హంగామా చేసింది. కానీ షో మాత్రం
సక్సెస్ కాలేదు. ఇలా చివరకు అది
సుమ చేతుల్లోకి వచ్చింది. పోయిన ఆదివారం మొదలైన ఈ షో లో మొదటి ఎపిసోడ్ బాగానే క్లిక్ అయింది. గ్రాండ్‌గా ఉండేందుకు
బిగ్ బాస్ కంటెస్టెంట్లను పట్టుకొచ్చారు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో గ్రూపులుగా బాగానే ఫేమస్ అయిన సోహెల్, మెహబూబ్, అఖిల్‌లను.. హారిక,నోయల్, లాస్యలను
సుమ తీసుకొచ్చింది..
కాగా, రానున్న ఆదివారం ఈ షో మరో యూనిట్ తో అలరిస్తుంది.రెండో ఎపిసోడ్‌లో కార్తీకదీపం యూనిట్
రచ్చ చేసింది.
డాక్టర్ బాబు,
కార్తీక్ పాత్రల్లో అదరగొట్టిన నిరుపమ్, హిమ, శౌర్య ,సౌందర్య వంటి వారంతా గెస్ట్‌లు వచ్చారు. వారిని
సుమ ఓ ఆట ఆడుకున్నట్టు కనిపిస్తోంది. సీరియల్ గురించి
సుమ సెటైర్స్ వేస్తూ అడగటం షో కు హైలెట్ అంశం అని చెప్పాలి..ఆ దెబ్బతో నిరుపమ్ సెంట్‌లోంచి పారిపోయి వెనక నుంచి వచ్చేశాడు. అయినా కూడా
సుమ ఆయన్ను వదల్లేదు..తాను అడుగుపెట్టనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ
బాలయ్య రేంజ్‌లో డైలాగ్ కొట్టేసింది.. ఇది షో రేటింగ్ ను పెంచేస్తుందనుని తెలుస్తోంది.. వచ్చే వారం ఎలా ఉంటుందో చూడాలి..