
ఆ ట్రయాంగిల్ స్టోరిని కూడా హమిదా షురూ చేయబోతున్నట్టు కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హమీదా సింగర్ శ్రీరామచంద్ర తో కలిసి స్విమ్మింగ్ పూల్ వద్ద కూర్చొని ముచ్చట్టు పెట్టింది. ఆ సమయంలో శ్రీరామచంద్ర కూడా హమిదా వెన్నుపై మసాజ్ చేస్తూ కనిపించాడు. ఆ తరవాత వేళ్లు పట్టుకుని మసాజ్ చేశాడు. ఇక ఈ సీన్ వేసిన సమయంలోనే లోబో ఓ లవ్ సాంగ్ పాడగా అది శ్రీ రామచంద్ర హమిదా ల సన్నివేశానికి సరిగ్గా సరిపోయింది. ఇక హమీదా శ్రీరామ చంద్ర తో మాట్లాడుతూ..నీ దగ్గర ఉంటే మంచిగా అనిపిస్తుంది. కానీ వెళ్లిపోవాలని అనిపిస్తుంది అంటూ రొమాంటిక్ డైలాగులు విసిరింది.
దాంతో శ్రీరామచంద్ర తెగ సిగ్గుపడిపోయాడు. ఇదిలా ఉండగా ఈరోజు వచ్చిన ప్రోమోలో హమిదా షణ్ణుకు కూడా లైన్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏకంగా అందరి ముందే షణ్ణుతో హెచ్ అని టాటూ వేసుకోవలంటూ హమిదా కోరింది. ఇక యాంకర్ రవి ఇప్పటికే షణ్ణు చేతిపై డీ రాసుకున్నాడని దాని కింద హెచ్ కూడా రాసుకోవాలేమో అనగా హమిదా రాసుకో అని చెప్పింది. అంతే కాకుండా హౌస్ లో ఉన్నన్ని రోజులో హెచ్ తో ఆ తరవాత డీతో అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. మరి చివరికి హమిద ట్రయాంగిల్ కథ ఎటువైపు వెలుతుందో చూడాలి.