తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది శ్రీముఖి.. వెండితెర పైన శ్రీముఖి హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించడం జరిగింది. అంతేకాకుండా తెలుగులో టాప్-5 ఫిమేల్ యాంకర్లలో ఒకటిగా రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెర పైన రాములమ్మగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా శ్రీముఖి పేరే బాగా వినిపిస్తోంది.


శ్రీముఖి చేసే అల్లరి గురించి ఆమె ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఒకవైపు యాంకర్ గా అలరిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది శ్రీముఖి. మూడు పదుల వయసు వచ్చిన ఈ ముద్దుగుమ్మ వివాహం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పెళ్లి విషయం గురించి ప్రస్తావించిన ప్రతిసారి ఈ విషయాన్ని దాటేస్తూ వస్తోంది శ్రీముఖి.


ఇదంతా ఇలా ఉండగా తాజాగా శ్రీముఖి అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో ముచ్చటించడం జరిగింది. మొదటిసారి ఈమె ఇలా ఛానల్ తో అభిమానులను పలకరించడం జరిగింది. ఈ సందర్భంగా చాలా సింపుల్ క్యూస్షన్లు అడగడం జరిగింది.. ఇందులో ప్రధానంగా తన సీక్రెట్లను సైతం బయటపెట్టింది శ్రీముఖి.. తన లవ్ సీక్రెట్ ను వెల్లడిస్తూ ఒక అభిమాని మీరు ఎప్పుడైనా లవ్ లో ఫెయిల్ అయ్యారా అని ప్రశ్నించగా.. శ్రీముఖి ఆలోచించకుండా బొచ్చెడు సార్లు అంటూ సమాధానం ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. హార్ట్ బ్రేక్ అయ్యే ప్రేమ కథలు కూడా చాలానే ఉన్నాయంటూ తెలియజేయడంతో శ్రీముఖి ఇన్నాళ్లు దాచిన రహస్యాన్ని బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే పెళ్లి గురించి మాత్రం చెప్పమంటే తనకి టైం సరిపోలేదని చెప్పి దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: