
అలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చి బలుపు చూపించిన వారిలో సీజన్ 4వ కంటెస్టెంట్ సోహైల్ కూడా ఉన్నారు. అలాంటి బలుపు చూపించడం వల్ల తాను చాలా నష్టం పోయానంటూ ఇప్పుడు తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ షో కి వెళ్లడం వల్ల తనకు జరిగిన లాభనష్టాలను కూడా తెలియజేశారు సోహైల్. తను హీరోగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి అవార్డులు రావాల్సి ఉండగా కానీ ఆ సినిమాకి దక్కాల్సినటువంటి గౌరవం కూడా దక్కలేదంటూ తెలియజేశారు. తన జీవితంలో గుర్తుండిపోయే సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ అని తెలిపారు.
అప్పటివరకు మెయిల్ ప్రెగ్నెంట్ కాన్సెప్ట్ తో ఎవరు కూడా సినిమా తీయలేదని అదొక గొప్ప సందేశం లాంటి సినిమా అలాంటి సినిమా సబ్జెక్టుని హ్యాండిల్ చేయడం కూడా కష్టమే కానీ తాను చేశానని.. ఆ సినిమాకి అనుకున్నంత స్థాయిలో ఆదరణ రాకపోవడం చాలా బాధగా ఉందని తెలియజేశారు. అయితే తన జీవితంలో ఒక మంచి సినిమా చేశానని సాటిస్ఫాక్షన్ తనకు ఉందని వెల్లడించారు సోహైల్. చాలామంది తనను చూసి ఆ సినిమా గురించి చెప్పినప్పుడు ఆనందపడ్డానని యూట్యూబ్ లో కూడా 20 కోట్ల వరకు వ్యూస్ వచ్చాయని తెలిపారు.
అయితే బిగ్ బాస్ తర్వాత తనకు చాలా మైనస్ గా మారిపోయిందని. ఆ సమయంలో తనకు విపరీతమైన బలుపు పెరిగింది. ఓవర్ కాన్ఫిడెంట్ ,నోటికి ఎలాంటి మాట వస్తే అలాంటివి మాట్లాడాను.. అతిగా మాట్లాడేవాడిని..అయితే తాను పక్కన ఉండే వాళ్ల ప్రభావంతోనే అలా మాట్లాడానని.. కానీ ఆ తర్వాత తను చేసిన తప్పు తెలుసుకొని..తన పని తాను చేసుకుంటున్నానని తెలిపారు సోహైల్. దేనికైనా టైం రావాలి అదే అన్నిటికి సమాధానం చెబుతుందని తెలుసుకుని తన పని చేసుకుంటున్నారని తెలిపారు.