గ్రహాంతర వాసులు అనేవారు ఉన్నారా లేదా అనే దానిపై సుదీర్ఘ కాలంగా కూడా చర్చ జరుగుతోంది.ఈ ఏలియన్స్ నిజంగానే ఉన్నారని కొందరు.. కాదు అది కల్పిత కథలని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఆ ఛాన్సే లేదని శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు.గ్రహాంతరవాసుల గురించి ఎన్నో రకాల సినిమాలు కూడా వచ్చాయి. అలాగే ఎన్నో రకాల పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఈ మధ్య వీటి గురించికూడా ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆకాశంలో వింత వస్తువుల కనిపిస్తున్నా వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఈ విశ్వంలో భూమిపై మనుషులు కాకుండా.. ఇంకా ఇతర గ్రహాలపై మనుషులను పోలిన జీవులే ఉన్నాయని.. ఆ విషయం అమెరికాకు తెలుసని ఎప్పటి నుంచో ప్రచారం కూడా ఉంది.కానీ అమెరికా ఈ విషయాన్ని దాచి పెడుతోందని విమర్శలున్నాయి. ఈ క్రమంలో అమెరికా కాంగ్రెస్‌మ్యాన్ ఒకరు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.ఇక ఆకాశంలో విమానాల స్థానంలో UFO (Unidentified Fkying Object)లు తిరిగే రోజు ఎంతో దూరంలో లేదని US కాంగ్రెస్ సభ్యుడు టిమ్ బార్చెట్ పేర్కొన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఆకాశంలో విమాన ప్రమాదాల కేసులు భారీగా పెరుగుతాయని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక రాబోయే కొన్ని రోజుల్లో ఆకాశంలో UFOలు మాత్రమే కనిపిస్తాయని టిమ్ బార్చెట్ తెలిపారు. మనుషులు తమ విమానాలను ఎగరవేయలేరని కూడా స్పష్టం చేశారు.


యూఎఫ్‌వోలను ఢీకొట్టిన తర్వాత అవి క్రాష్ అవుతాయని కూడా జోస్యం చెప్పారు. దీనిపై సైన్యం జోక్యం చేసుకోవాలని టిమ్ బార్చెట్ డిమాండ్ చేయడం జరిగింది.గ్రహాంతరవాసులను ఎదుర్కోవడానికి నాసా అనేక ప్రణాళికలను కూడా ప్రారంభించినప్పటికీ... అవి అసలు వర్కవుట్ కాకపోవచ్చని అన్నారు. నాసా మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.ఇక గ్రహాంతరవాసుల సమాచారాన్ని దాచిపెడుతోందని,, అమెరికా ప్రభుత్వంపై ఆరోపణలు రాకముందే ప్రజలకు సమాచారం అనేది ఇవ్వాలని టీమ్ డిమాండ్ చేశారు.ఇప్పటివరకు చూసిన UFOల రికార్డులు ఇంకా గ్రహాంతరవాసులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిరంగపరచాలని అన్నారు.ఇక గ్రహాంతరవాసుల గురించిన సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం దాచిపెడుతోందని.. నిజాన్ని ప్రజల నుంచి దాచిపెడితే, దాని పరిణామాలు అనేవి మరింత భయంకరంగా ఉంటాయని టిమ్ అన్నారు. అందుకే ఈ ఏలియన్స్‌పై నిజం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: