ఈ భూమ్మీద ఎన్నో రకాల విష జంతువులు ఉన్నాయి.విషపూరీతమైనవి అంటే ముందుగా గుర్తొచ్చేవి పాములు.విషపూరితమైన పాములను మనం చాలా చూశాము. అయితే విషపూరిత కప్పల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ ప్రపంచంలో అలాంటి ఒక కప్ప కూడా ఒకటి ఉంది.ఇది చూడటానికి చాలా క్యూట్ గా అందంగా ఉన్నా.. వామ్మో చాలా విషపూరితమైనది. ఈ కప్పలను గోల్డెన్ పాయిజన్ కప్పలు అని కూడా అంటారు. అవి చూడటానికి సాధారణంగా రెండు అంగుళాలు లేదా కొంచెం పెద్దవి లేదా చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ కప్పలకు ఏకంగా పది మందిని చంపేంత విషం  ఉండటం గమనార్హం. కొన్ని సంవత్సరాలుగా కొలంబియాలోని వేటగాళ్ళు తమ ఎరను పట్టుకోవడానికి ఈ రకమైన కప్ప విషాన్ని వాడతారట.ఈ కప్పల విషం ప్రధానంగా మొక్కలు ఇంకా అలాగే విషపూరిత కీటకాల నుండి వస్తుందని నమ్ముతారు. అయితే ఇతర ప్రదేశాలలో ఉన్న కప్పలకు ఎలాంటి విషం అనేది లేకపోయినా..ఈ కప్పల్లో విషం ఉండటం చాలా భయాందోళన కలిగించే అంశం. ఈ కప్పలను తాకడం ఖచ్చితంగా మరణానికి దారితీస్తుంది. వైద్య పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులు ఈ రకమైన కప్పలను వైద్య రంగంలో వాడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంకా అలాగే ఈ కప్పలు ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చని వైద్యులు భావిస్తున్నారు.


 దీని ద్వారా శక్తివంతమైన పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్‌లను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ మచ్చల కప్పలో 100 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. వాటి సగటు పొడవు విషయానికి వస్తే ఒక అంగుళం కంటే ఎక్కువ. చాలా కప్ప జాతులు కొలంబియాలోని పసిఫిక్ తీరంలో రెయిన్‌ఫారెస్ట్‌లోని చిన్న పాచ్‌లో అవి నివసిస్తున్నాయి. ఈ కప్పలు తక్కువ ప్రాంతంలో చాలా ఎక్కువ సంఖ్యలో జీవించగలవు.ఈ కప్ప రంగు పసుపు, నారింజ ఇంకా అలాగే లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వివిధ ప్రదేశాలను బట్టి వాటి రంగులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ కప్పలు వేటాడేవారిపై విష ప్రయోగం చేస్తాయట.ఇవి ప్రధానంగా ఈగలు, చీమలు ఇంకా అలాగే చెదపురుగులను తింటాయి. బంగారు పాయిజన్ కప్పల శరీరాలు కూడా చాలా విషపూరితమైనవి.అవి ఏదైనా ప్రమాదాన్ని గుర్తించినప్పుడు, చర్మం నుండి విషం రిలీజ్  అవుతుంది. ఆ విషం నేరుగా మనిషి చర్మంపై పడినప్పుడు దెబ్బకు మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ కప్పల విషం మనుషులపై పడినప్పుడు పల్స్‌ రేటు పడిపోయే చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: